వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పై ఐటి సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్ కు వాసవి సంస్థ అనుబంధంగా ఉన్నట్లు గుర్తించారు. వాసవి సంస్థలో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు నిర్వహించింది ఐటీశాఖ. క్యాప్స్ గోల్డ్ లో కూడా అభిషేక్, సౌమ్య డైరెక్టర్ గా ఉన్నారు.. వాసవికి సంబంధించిన 40 కంపెనీలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పైన ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ.. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై ఐటీ సోదాలు నిర్వహించింది.. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీలపై సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read:Vasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పై ఐటి సోదాలు..
హైదరాబాద్ తో పాటు వరంగల్లోనూ ఐటీ దాడులు చోటుచేసుకున్నాయి. వాసవి గ్రూప్ తోపాటు, కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు.. చందా శ్రీనివాసరావుతో పాటు, చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు.. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లోఐటీ సోదాలు చేశారు. బోయిన్‌పల్లిలోని లగ్జరీ గ్రీన్ విల్లాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ గ్రీన్ విల్లాలోని మూడు విల్లాలలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.. డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో సుమారు పది ఐటీ టీమ్ లు సోదాలు నిర్వహిస్తున్నాయి.
Also Read:Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఏడుగురు..
హైదరాబాదులోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ పై ఐటి సోదాలు జరిగాయి. 15 చోట్ల సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. బంగారం కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్స్ కు అమ్ముతున్నట్లు తేలింది. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్‌సేల్ గా ఉన్న సంస్థలపై ఐటి సోదాలు నిర్వహించింది. బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు.
