Site icon NTV Telugu

IT Raids: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు.. అర్ధరాత్రి వరకు సోదాలు..

Grandhi Srinivas

Grandhi Srinivas

IT Raids: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఇంట్లో, వ్యాపార సంస్థల్లో దాడులు నిర్వహించారు ఆదాయపన్నుశాఖ అధికారులు.. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.. ఈ రోజు కూడా ఆయనకు సంబంధించిన వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించనున్నారని సమాచారం.. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రంధిపై ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాల్లో నిన్న ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు. కేంద్ర పోలీసు బలగాల భద్రత నడుమ ఐటీ అధికారులు భీమవరంలోని గ్రంధి శ్రీనివాస్‌ ఇంటికి చేరుకుని.. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రొయ్యల వ్యాపారంలో గ్రంధి శ్రీనివాస్‌కు ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉన్నాయి. భీమవరంలోని ఇతర రొయ్యల వ్యాపారులతో లావాదేవీలు సాగించినట్టు తెలుస్తోంది.. మొత్తంగా.. గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి..

Read Also: Citadel Honey Bunny : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత అవైటెడ్ సిరీస్..

Exit mobile version