NTV Telugu Site icon

IT Raids In Viveka Houses: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ సోదాలు

New Project (2)

New Project (2)

IT Raids In Viveka Houses: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ ఎన్నికల బరిలో నిలిచారు. వేకువజాము నుంచి అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. చెన్నూరు, హైదరాబాద్, సోమాజిగూడలోని వివేక్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే… పార్టీ కార్యాలయాలు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు.

Read Also:Tuesday : మంగళవారం హనుమంతుడికి ఈ పరిహారాలు చేస్తే కష్టాలన్నీ మాయం..

ఐటీ సోదాల సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చెన్నూరులోని వివేక్ ఇంటి వద్ద గుమిగూడారు. వారిని పోలీసులు అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రచారంలో భాగంగా వివేక్ డబ్బు సంచుల కొద్ది తీసుకొచ్చి పంచుతున్నాడని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆయన ఇంటి దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు. వివేక్‌కు మద్దతుగా నిలిచారు.

Read Also:Rajastan: రాజస్థాన్‎లో ఎన్నికల అభ్యర్థి పోస్టర్లున్న కారులో మైనర్ పై సామూహిక అత్యాచారం

Show comments