NTV Telugu Site icon

Ponguleti: రెండో రోజూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

Ponguleti

Ponguleti

రెండో రోజూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ ఉన్న ఇంట్లో, నందగిరి హిల్స్ లోని పొంగులేటి బంధువు ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Read Also: Malavika Mohanan: శారీ లో అందాలు ఆరబోస్తున్న మాళవిక మోహనన్..

జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి డాక్యుమెంట్స్ ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి రూం కీస్ లేకపోవడంతో నిన్నటి నుంచి కీస్ కోసం ఐటీ అధికారులు వెయిటింగ్ చేస్తున్నారు. కీస్ మేడం వద్ద ఉన్నాయని వాచ్ మెన్ చెప్పారు. నిన్న ఖమ్మం నుంచి వచ్చిన పొంగులేటి కుటుంబ సభ్యులు.. పొంగులేటి రూంలో సోదాలు చేయాలని.. కీస్ కావాలని పొంగులేటి భార్యకి ఐటీ అధికారులు కాల్ చేసి అడిగారు. అయితే, నిన్న (గురువారం) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరులో నామినేషన్ దాఖలు చేశారు. ఒక వైపు ఐడీ సోదాలు కొనసాగుతున్న మరో వైపు ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక, తనపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయని తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Show comments