NTV Telugu Site icon

IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ..

It Minister Sridhar Babu

It Minister Sridhar Babu

IT Minister Sridhar Babu: వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లో అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ కొత్త R&D సెంటర్ ప్రకటించింది. ఆటోమోటివ్ సెమీకండక్టర్స్‌లో గ్లోబల్ లీడర్, టెస్లా, టాటా వంటి అగ్ర EV బ్రాండ్‌లకు కీలకమైన సరఫరాదారు అయిన అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో అత్యాధునిక R&D కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ పరిశ్రమలలో భారతదేశం యొక్క సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ కోసం ఈ ప్రధాన మైలురాయిని ప్రకటించినందుకు మంత్రి అభినందించారు. వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని అన్నారు.

Read also: Nimmala Ramanaidu: గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తాం: మంత్రి నిమ్మల

వచ్చే ఐదు ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పించే లక్ష్యం అన్నారు. ఇండియాలో ఎన్నో ప్రధాన నగరాలను కాదని హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇక్కడున్న ఎకో సిస్టం, స్కిల్ వర్కర్ల అవైలబిలిటీ, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో సెమీ కండక్టర్ల వినియోగం విరివిగా పెరుగుతుందన్నారు. ఆటోమేటివ్ ,ఇండస్ట్రీస్ రంగాలలో సెమీ కండక్టర్ల వినియోగంపై గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారని తెలిపారు. అలెగ్రో మైక్రో సిస్టమ్స్ మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్ ఐసి మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ లీడర్స్ అని తెలిపారు. ఈ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ తెలంగాణకు రావడం చాలా సంతోషమని తెలిపారు.
Gautam Gambhir: టీమిండియా ప్లేయర్స్లో ఎవరు 11 గంటల పాటు బ్యాటింగ్‌ చేస్తారు..? గంభీర్‌ రిప్లై అదుర్స్