NTV Telugu Site icon

Parthasarathy: అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదే:మంత్రి పార్థసారథి

New Project (2)

New Project (2)

గృహానిర్మాణాలు సకాలంలో పూర్తి చేయటానికి కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖపై మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించే అవకాశాలపై నివేదికలు రూపొందించాలన్నారు. ఆప్షన్- 3 కింద నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లతో సమావేశమై సకాలంలో గృహాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

READ MORE: Bomb threat: దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

కాగా.. ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొలుసు పార్థసారథికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ బాధ్యతలు అప్పజెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నేతల్లో ఆయన ఒకరు. పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కరకంపాడులో రాజకీయ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి, కొలుసు పెదారెడ్డి.. ఆయన 1991, 1996లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్థసారథి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్థసారధి కాంగ్రెస్ పార్టీ నుంచి 2004 (వుయ్యూరు), 2009 (పెనమలూరు)లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరిన పార్థసారథి మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో పెనమలూరు నుంచి పోటీ చేసి ప్రస్తుత బోడె ప్రసాద్‌పై 11,317 మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం పార్థసారధి టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.