NTV Telugu Site icon

Adipurush : రావణుడిని రౌడీ లా చూపించడం బాధేసింది : ‘రామాయణ్’ సీత

Adipurush

Adipurush

Adipurush :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ “ఆదిపురుష్”..ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవుడిగా నటించాడు..అలాగే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకిగా నటించింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు.ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదొక వివాదం వస్తూనే వుంది.ఈ సినిమాలోని పాత్రల వేషధారణలపై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.పూర్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా ఎంతో నాసిరకంగా ఉందని బాగా కామెంట్స్ వచ్చాయి.అయితే మొదట ఈ సినిమా గ్రాఫిక్స్ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవడంతో చిత్ర యూనిట్ మరి కొంత సమయం తీసుకోని ఈ సారి అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.

Read Also :Bhaje Vaayu Vegam : ఓటీటీలోకి వచ్చేస్తున్న’భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అయితే  ‘రామాయణ్’ సీరియల్ లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆదిపురుష్ చిత్రంలోని పాత్రలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.ఆదిపురుష్ సినిమా చూసిన పిల్లలు రామాయణం అంటే ఇలా ఉంటుంది ఏమో అని భావిస్తారు.అది భవిష్యత్ కే ప్రమాదకరం అని ఆమె తెలిపారు.ఈ చిత్రంలో చూపించిన విధంగా రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ కూడా చెప్పడం లేదు.రావణుడు గొప్ప శివ భక్తుడు.ఆయనలో చాలా మంచి లక్షణాలు వున్నాయి.ఆయన చేసిన ఒకే ఒక తప్పు సీతను అపహరించడమే .ఆ ఒక్క తప్పు చేయకుంటే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారని ఆమె తెలిపింది.అయితే ఆదిపురుష్ సినిమాలో ఆయన పాత్ర ఓ రౌడీలా చూపించడం బాధేసింది .అలాగే సీతా దేవిని గులాబీరంగు చీరలో చూపడం వంటివి అస్సలు నచ్చలేదు .నేటి టెక్నాలజీ తో కొత్తగా చూపించాలంటే స్వతంత్ర సమరయోధుల కథలను తెరకెక్కిస్తే బాగుంటుంది కానీ ఇతిహాసాల జోలికి వెళ్లోద్దని ఆమె తెలిపింది .

Show comments