NTV Telugu Site icon

Savings Account: బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి నగదు డిపాజిట్ చేస్తున్నారా.? అయితే ఐటీ నోటీసు గ్యారెంటీ..

Bank

Bank

Savings Account: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా అవసరం. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి పరిమితిలు లేవు. దీని కారణంగానే ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు బ్యాంకు ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా ఇస్తుంది. నిబంధనల ప్రకారం, జీరో బ్యాలెన్స్ ఖాతా మినహా అన్ని ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడం అవసరం. లేకపోతే బ్యాంక్ మీకు పెనాల్టీని వసూలు చేస్తుంది. కానీ పొదుపు ఖాతాలో గరిష్టంగా ఎంత డబ్బు ఉంచవచ్చనే దానిపై చర్చ లేదు. దీని గురించి ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.

Deepika Singh : పండగవేళ పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకునే..

బ్యాంకు నిబంధనల ప్రకారం, మీరు మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బునైనా ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అయితే మీ ఖాతాలో జమ చేసిన మొత్తం ఎక్కువై అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే, ఆ ఆదాయ మూలాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంకు శాఖకు వెళ్లి నగదు డిపాజిట్ చేయడానికి, నగదు ఉపసంహరించుకోవడానికి పరిమితి ఉంది. కానీ చెక్కు లేదా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా, మీరు సేవింగ్స్ ఖాతాలో రూ. 1 నుండి వేల, లక్షలు, కోట్ల వరకు ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేయవచ్చు.

IND vs BAN: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. ముంబై యువ స్పిన్న‌ర్‌కు ఆహ్వానం!

ఇక బ్యాంకు లో అయితే రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తే, దానితో పాటు మీ పాన్ నంబర్‌ను కూడా అందించాలని నిబంధన చెబుతోంది. మీరు ఒక రోజులో రూ. 1 లక్ష వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, మీరు మీ ఖాతాలో క్రమం తప్పకుండా నగదు జమ చేయకపోతే, ఈ పరిమితి రూ. 2.50 లక్షల వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఒక వ్యక్తి తన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.10 లక్షల నగదు మాత్రమే జమ చేయవచ్చు. ఈ పరిమితి మొత్తం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలతో పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది.

Traffic Constable: విషాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

ఇకపోతే, ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, ఆ విషయాన్ని బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అటువంటి పరిస్థితిలో వ్యక్తి ఈ ఆదాయ మూలాన్ని చెప్పాలి. వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్‌లో మూలం గురించి సంతృప్తికరమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతే అతను ఆదాయపు పన్ను శాఖ రాడార్ కిందకు రావచ్చు. అంతేకాకుండా అతనిపై విచారణ నిర్వహించవచ్చు. పట్టుబడితే భారీ జరిమానా విధించవచ్చు. వ్యక్తి ఆదాయ వనరు గురించి చెప్పకపోతే డిపాజిట్ చేసిన మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌ఛార్జ్, 4 శాతం సెస్ విధించవచ్చు. అయితే, మీరు రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేరని దీని అర్థం కాదు. మీ వద్ద ఈ ఆదాయానికి సంబంధించిన రుజువు ఉంటే, మీరు చింతించకుండా నగదు డిపాజిట్ చేయవచ్చు. అయితే ప్రయోజనం దృష్ట్యా మీ పొదుపు ఖాతాలో ఎక్కువ డబ్బును ఉంచే బదులు ఆ మొత్తాన్ని FDగా మార్చడం లేదా మీరు మంచి రాబడిని పొందగలిగే ఇతర చోట పెట్టుబడి పెట్టడం మంచిది.

Show comments