IT Companies Q3 Performance: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3వ త్రైమాసికం ముగిసింది. దీంతో.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్.. ఈ 3 నెలల ఉమ్మడి పనితీరుకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీలు అధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 3 దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కూడా తమ లాభనష్టాల వివరాలను ప్రభుత్వానికి అందజేశాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలోని 2వ త్రైమాసికంతోను మరియు గతేడాది ఇదే సమయంలో జరిగిన బిజినెస్‌తోను ప్రస్తుత ఫలితాలను పోల్చిచూసుకొని తమ పురోగతిని బేరీజు వేసుకున్నాయి. ఆ వివరాలు చూద్దాం.. ఇన్ఫోసిస్ ఏకీకృత ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 20 శాతానికి పైగా పెరిగి 38,318 కోట్ల రూపాయలకు చేరింది.
McDonald’s Business Strategy: పోటీ సంస్థలకు భిన్నంగా మెక్ డొనాల్డ్స్ వ్యాపార వ్యూహం
2022లోని చివరి 3 నెలల్లో కలిపి నికర లాభం 13.4 శాతం వృద్ధి చెంది 6,586 కోట్ల రూపాయలకు చేరింది. ఐటీ సెక్టార్‌కి సంబంధించి.. డిసెంబర్ క్వార్టర్.. వీక్ సీజన్‌గా మారినప్పటికీ ఇన్ఫోసిస్ 3.3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ సొంతం చేసుకోవటం విశేషం. ఈ సంస్థకు గత 8 త్రైమాసికాలతో పోల్చితే ఇది అత్యంత బలమైన త్రైమాసికం అనేది గమనించాల్సిన అంశం.
విప్రో లిమిటెడ్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ గత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 14 పాయింట్ 3 శాతం పెరిగి 23 వేల 229 కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తాజాగా ముగిసిన త్రైమాసికంలో నికర లాభం పోయినేడాది ఇదే సమయం కన్నా 2 పాయింట్ 8 శాతం పెరిగి 3 వేల 53 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ 3 నెలల్లో విప్రో లిమిటెడ్ 4.3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కైవసం చేసుకుంది.
కిందటి ఏడాది కన్నా ఇవి 26 శాతం అధికం కావటం చెప్పుకోదగ్గ విషయం. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఏకీకృత ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి దాదాపు 20 శాతం పెరిగి 26,700 కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రీసెంట్‌గా క్లోజ్ అయిన క్వార్టర్‌లో హెచ్‌సీఎల్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ కన్నా ఈసారి 19 శాతం గ్రోత్ అయి 4,096 కోట్ల రూపాయలుగా నమోదైంది.
అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో 2 పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్ల విలువైన 17 డీల్స్‌ను గెలుచుకుంది. మొత్తమ్మీద చూస్తే ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్.. ఈ మూడు ఐటీ కంపెనీలు కూడా గత 3 నెలల్లో మంచి పనితీరు కనబరిచాయి. అటు.. నికర ఆదాయంలో, ఇటు.. నికర లాభాల్లో.. రెండింటిలోనూ రాణించాయి. తద్వారా 2022 సంవత్సరానికి సంతోషంగా సెండాఫ్ ఇచ్చి 2023ని ఆనందంగా ఆహ్వానించాయని ఈ ఆర్థిక ఫలితాలను బట్టి చెప్పొచ్చు.