ISRO: పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగం విజయవంతం అయ్యింది.. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించారు.. ఆదివారం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత ఈ రోజు రాత్రి 9 గంటల 58 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 కక్ష్యలోకి దూసుకెళ్లింది.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది రాకెట్.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనుంది స్పేస్ డాకింగ్ టెక్నాలజీ.
PSLV C-60 ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు శ్రీకారం చుడుతోంది ఇస్రో. స్పాడెక్స్ జంట ఉపగ్రహాలతో పాటు నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది.. అంతరిక్షంలో ఎంతో కీలకమైన స్పాడెక్స్ ఉపగ్రహాల డాకింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఇస్రో. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత్ సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. PSLV C-60 ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి.. వాటిని అనుసంధానిస్తూ, విడగొడుతూ ఇస్రో ప్రయోగాలు చేపట్టనుంది. ఈ ప్రయోగాల్లో డాకింగ్ సిస్టమ్‌ను పరిశీలించనున్నారు.
స్పాడెక్స్ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపారు సైంటిస్టులు. వీటిలో 14 ఇస్రోకు చెందినవి కాగా.. మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు, విశ్వ విద్యాలయాలకు చెందినవి. ఇందులో తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ కూడా ఉంది. అలాగే, ఇస్రో సహకారంలో UHF కమ్యూనికేషన్ మాడ్యూల్‌కు సంబంధించిన స్వేచ్ఛశాట్-V జీరోని కూడా అంతరిక్షంలోకి పంపారు.. ముంబైకి చెందిన అవిటి యూనివర్సిటీ విద్యార్థులు పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపించారు.. అంతరిక్షంలో ప్రత్యేక పరిస్థితిల్లో మొక్కలు ఎలా పెరుగతాయనే అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది.