Unit 8200 Israel: మొస్సాద్‌ను మించిన దళం.. ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ అదృశ్య సైన్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unit 8200 Israel: అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా ఏదో రకంగా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఎఫెక్ట్ అవుతున్నవే.. ప్రస్తుతం ఈ యుద్ధం గురించి ఎలాంటి వార్తలు వచ్చిన అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వైరల్ వార్త ఇప్పుడు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. అదే.. ఇజ్రాయెల్ యొక్క యూనిట్ 8200 . అసలు ఈ యూనిట్ ప్రత్యేకత ఏంటి, అది ఎందుకని ఇంత వైరల్ అవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Lenin: ఎరక్క పోయి ఇరుక్కు పోయారా?
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఇరాన్ ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడానికి ఇజ్రాయెల్ ఈ యూనిట్‌ను ఉపయోగిస్తోందని చెబుతున్నారు. ఇరాన్ అగ్రనాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ, ఐఆర్‌జిసి అధిపతి మహమ్మద్ పక్‌పూర్ వంటి అగ్ర నాయకుల హత్యలలో ఈ యూనిట్ 8200 పాత్ర పోషించిందని అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. గతంలో ఈ యూనిట్ హిజ్బుల్లా అగ్రనాయకులను సైతం హత్య చేసిందని చెబుతున్నారు. నిజానికి ఈ ఇజ్రాయెల్ యూనిట్‌ను మెస్సాద్ కంటే అత్యంత ప్రమాదకరమైన దళంగా అభివర్ణిస్తారు. ఈ ఇజ్రాయెల్ యూనిట్ సైబర్ సెక్యూరిటీ, కెమెరాలు, సోషల్ మీడియా ద్వారా ఇరాన్ అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించిందని, ఈ యూనిట్ జరిపిన ఆపరేషన్ల ఫలితంగా కనీసం 40 మంది ఇరాన్ ప్రముఖ నాయకులు హత్యకు గురయ్యారని సమాచారం. ఈ యూనిట్ మొస్సాద్‌కు భిన్నమైనదని, ఇజ్రాయెల్ రక్షణ దళాలలో ఒక ప్రత్యేక గూఢచార విభాగంగా ఇది పని చేస్తుందన్నారు.
యూనిట్ 8200 అంటే..
ఇజ్రాయెల్‌లో యూనిట్ 8200ను “ష్మోనే మటైమ్” అని పిలుస్తారు. 1948లో స్థాపించిన ఈ యూనిట్ ఇజ్రాయెల్ రక్షణ దళాల వ్యక్తిగత గూఢచార సంస్థ. సైన్యానికి గూఢచార, సైబర్ సంబంధిత సమాచారాన్ని అందించడం, తద్వారా వారు తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగేలా చేయడం ఈ యూనిట్ ప్రధాన లక్ష్యం. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం.. ఈ సంస్థ అమెరికా జాతీయ భద్రతా సంస్థ లేదా బ్రిటన్ GCHQకి సమానమైనది. ఇది ఇజ్రాయెల్ సైనిక దళంలో అతిపెద్ద విభాగం అని కూడా చెబుతారు. యూనిట్ 8200 రహస్య కార్యకలాపాలను నిర్వహిస్తుందని, ఇది సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ నుంచి డేటా మైనింగ్, సాంకేతిక దాడుల వరకు అన్నింటిలోనూ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఒక కెమెరాను హ్యాక్ చేయడం ద్వారా ఇరాన్‌లో అలీ ఖమేనీ ఉన్న ప్రదేశాన్ని ఈ యూనిట్ గుర్తించినట్లు సమాచారం.
గతంలోనూ షాక్ ఇచ్చిన యూనిట్ 8200..
2005 – 2010 మధ్య ఇరాన్ అణు ఉత్పత్తి సౌకర్యాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ ఒక సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించింది. యురేనియం సుసంపన్నం చేయడం ద్వారా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఇజ్రాయెల్‌కు సమాచారం అందింది. దీంతో, ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఈ బాధ్యతను యూనిట్ 8200కు అప్పగించారని ఇజ్రాయెల్ పాలకులు. యూనిట్ 8200 ఈ పనిని సునాయాసంగా పూర్తి చేసింది. ఈ యూనిట్‌లోని సిబ్బందిలో చాలా మంది 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని చెబుతున్నారు. ఇది ఇజ్రాయెల్‌లోని అత్యంత యువ యూనిట్లలో ఒకటిగా ఉంది. పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని నివారించడానికి ఈ యూనిట్ సిబ్బంది, అధికారులందరూ చిన్న చిన్న బృందాలుగా విడిపోయి నిర్దేశిత కార్యకలాపాలను అమలు చేస్తారని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొస్సాద్ ఎంతటి ప్రమాదకరమైన గూఢాచార సంస్థ అనేది అందరికీ తెలుసు. కానీ అంతటి మొస్సాద్‌కు మించిన దళం ఇజ్రాయెల్ దగ్గర ఉందని అనేక దేశాలకు తెలియదు. ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో దీని పేరు మరొకసారి బయటికి రావడంతో వైరల్‌గా మారింది.
READ ALSO: Market Bloodbath: అక్షరాల రూ.51 లక్షల కోట్లు.. మొత్తం లాస్! ఎలాగో చూసేయండి
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!