NTV Telugu Site icon

Israel-Hamas War: హమాస్ గ్రూపుకు సంబంధించిన వివరాలు మాకు కావాలి..

Hamas

Hamas

హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే హమాస్ సాయుధ గ్రూపు బంధీలుగా మార్చుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఒక్కొక్కరిగా విడిచి పెడుతుంది. బంధీలు కూడా తమను హమాస్ తీవ్రవాద నేతలు బాగానే చూసుకున్నారని చెప్పారు. ఈ రకంగా ప్రపంచ దేశాల నుంచి సానుభూతి పొందే అవకాశాలను హమాస్ తీవ్రవాదులు సానుపొందాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ సైనికుల విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు చల్లుతున్నారు. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ గ్రూపు బంధించిన వివరాలను తమకు అందించాలని.. అలా ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని ఆ కరపత్రాల్లో పేర్కొంది.

Read Also: Katrina Kaif: చీరకట్టులో మైమరిపిస్తున్న కత్రినా అందాలు…

ఇక, మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటే ఈ సహాయం చేయండి అని ఇజ్రాయెల్ పేర్కొనింది. మీ ఏరియాల్లో బంధీల వివరాలను మాకు ఇవ్వండి అంటూ ఇజ్రాయెల్ మిలిటరీ ఆ కరపత్రాల్లో వెల్లడించింది. ఈ సమాచారం ఇచ్చిన వారికి ఇంటికి భద్రత అందించడమే కాదు, ఆర్థిక సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మీ వివరాలను గోప్యంగా ఉంచడం మా బాధ్యత అని పేర్కొంది. ఈ బంధీల గురించి సమాచారం అందించడానికి అవసరమైన ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాలను ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

Read Also: Nabha Natesh: లంగా ఓణీలో మాయచేస్తున్ననభా నటేష్..

తాజాగా.. దక్షిణ గాజాలోని నాస్సర్ హాస్పిటల్‌లో ఆశ్రయం పొందుతున్న శరణార్థి ఖాన్ యూనిస్ ఇజ్రాయెల్ మిలిటరీ పంచుతున్న ఈ కరపత్రాలను చించేశాడు. ఇక, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి హాట్ కామెంట్స్ చేశాడు. ‘మీరేం కావాలని కోరుకున్నా.. అది మాకు అవసరమే లేదు.. గాజాలోని మేమంతా ఏం చెబుతున్నామంటే.. తూర్పు నుంచి పశ్చిమం వరకు మేం ప్రతిఘటిస్తున్నామని అతడు చెప్పుకొచ్చాడు.

Show comments