Site icon NTV Telugu

Gaza : ఓ వైపు యుద్ధం.. మరో వైపు వర్షం.. చలి.. గాజాలో జన జీవితం దుర్భరం

New Project 2023 12 14t131140.013

New Project 2023 12 14t131140.013

Gaza : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వాన్నంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వర్షం, చలితో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి జనాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. గాజాలో నిరంతర వర్షం, చలి పాలస్తీనా కుటుంబాల కష్టాలను మరింత పెంచింది. ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు గుడారాల్లో దాక్కుని జీవిస్తున్నారు. అవి కూడా నీటితో నిండిపోతున్నాయి. కుండపోత వర్షాలు పాలస్తీనియన్లకు కొత్త సవాలును సృష్టించాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలను అనుసరించి, వారు తమ ఇళ్లను వదిలి దక్షిణం వైపు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గాజాలో పరిస్థితి నిరంతరం దిగజారుతోంది. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

Read Also:Mohammed Shami: ప్రధాని పరామర్శ తర్వాతే.. ఒకరితో మరొకరం మాట్లాడుకున్నాం!

ప్రస్తుతం గాజా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నీరు, ఆహారం, మందుల కోసం ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దీని నుండి తప్పించుకోవడానికి వేలాది మంది పాలస్తీనియన్లు దక్షిణం వైపు కారు, ట్రక్కు, గుర్రపు బండి లేదా కాలినడకన పరుగెత్తుతున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకు 18 వేల మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ ఘర్షణలో దాదాపు 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా గాజాపై బాంబు దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 18 వేల మందికి పైగా మరణించారు.

Read Also:Gidugu Rudraraju: వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్‌లో ఉన్నారు..!

Exit mobile version