Site icon NTV Telugu

Israel Syria Ceasefire: ఇజ్రాయెల్ – సిరియా మధ్య కాల్పుల విరమణ.. అమెరికా ప్రకటన

Israel Syria Ceasefire

Israel Syria Ceasefire

Israel Syria Ceasefire: ఇజ్రాయెల్, సిరియా నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల తరువాత కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా రాయబారి టామ్ బారక్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఒప్పందానికి టర్కీ, జోర్డాన్ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు, సిరియాలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కొత్త నాయకుడు అహ్మద్ అల్-షరా మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని టామ్ బారక్ వెల్లడించారు.

Rajagopal Reddy: పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ వ్యాఖ్యలపై.. కోమటి రెడ్డి ఫైర్

టామ్ బారక్ ట్విటర్ (X) ద్వారా డ్రూజ్, బెడౌయిన్, సున్నీలు ఇంకా ఇతర మైనారిటీలను ఉద్దేశించి.. ఆయుధాలు విసిరేసి, సిరియాలో శాంతి, ఐక్యతతో కొత్త గుర్తింపు ఏర్పరుచుకుందాం అని కోరారు. ఇజ్రాయెల్ బుధవారం సిరియా రాజధాని దమాస్కస్ మీద భారీ వైమానిక దాడులు జరిపింది. ఇందులో సిరియా సైనిక ప్రధాన కార్యాలయం కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులకు కారణం ఏమిటంటే.. సిరియాలోని స్వైదా ప్రాంతంలో డ్రూజ్, బెడౌయిన్ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డ్రూజ్ సముదాయాన్ని రక్షించడమే ఈ దాడుల ఉద్దేశమని ఇజ్రాయెల్ పేర్కొంది.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే..?

Exit mobile version