Houthi Leadership Killed: యెమెన్ హౌతీలను గురువారం ఇజ్రాయెల్ చావుదెబ్బ కొట్టింది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హౌతీల ప్రధాన మంత్రితో సహా దాదాపు మొత్తం మంత్రివర్గం ఖతం అయ్యింది. ఈ వైమానిక దాడిలో యెమెన్ హౌతీల ప్రధాన మంత్రి అహ్మద్ గలేబ్ అల్-రహావితో సహా వ్యవసాయ, సంక్షేమ, ఆర్థిక, న్యాయ, సమాచార, విద్య, విదేశాంగ వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాల మంత్రులు మరణించినట్లు శనివారం హౌతీ వార్తా సంస్థ పేర్కొంది. వీళ్లతో పాటు హౌతీ సైనిక కార్యకలాపాల కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారని పేర్కొంది.
READ ALSO: Mahesh Babu : ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మహేశ్ బాబు ఎమోషనల్
ధ్రువీకరించిన అగ్రనాయకత్వం..
రాజధాని సనాలో సీనియర్ హౌతీ నాయకులు సమావేశమైన ఒక కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది నిఘా, వైమానిక శక్తి ద్వారా సాధ్యమైన ‘సంక్లిష్ట ఆపరేషన్’గా అభివర్ణించింది. ఈ దాడిలో ప్రధాన మంత్రితో సహా అనేక మంది మంత్రులు మరణించారు. యెమెన్ హౌతీల సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధిపతి మహదీ అల్-మషాత్ ఈ మరణాలను ధ్రువీకరించారు. అయితే హౌతీ పాలన రక్షణ మంత్రి మరణం గురించి స్పష్టంగా తెలియలేదు. హౌతీల తాత్కాలిక ప్రధానమంత్రి బాధ్యత మొహమ్మద్ మోఫ్తాకు అప్పగించినట్లు తెలుస్తుంది. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా ఇరాన్ మద్దతు గల హౌతీ సంస్థ ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను చేస్తోంది. ఇదే సమయంలో హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణులను కూడా ప్రయోగిస్తున్నారు.. కానీ వాటిలో ఎక్కువ సంఖ్యలో క్షిపణులను ఇజ్రాయిల్ సైన్యం అడ్డుకున్నారు. దీనికి ప్రతిస్పందనగానే ఇజ్రాయెల్ హౌతీ ఓడరేవుతో సహా యెమెన్లోని హౌతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై అనేక దాడులు చేసింది.
హౌతీలు ఎవరూ..
మధ్యప్రాచ్య దేశమైన యెమెన్ తొలి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్‌కు(1990 నుంచి 2012వరకు పాలన) వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి పేరే ‘హౌతీ’. ఈ సంస్థ 1992లో జైదీ(షియా ఇస్లాంలోని ఒక వర్గం) మత నాయకుడు హుస్సేన్ అల్-హౌతీ నాయకత్వంలో ఏర్పడింది. అబ్దుల్లా సలేహ్ అవినీతికి పాల్పడ్డారనేది హౌతీల ప్రధాన ఆరోపణ. హౌతీలను తమ మద్దతుదారులు అన్సార్ అల్లా(దేవుడి మద్దతుదారులు) అని కూడా పిలుస్తారు. ఇదొక సాయుధ సంస్థ. వీరి ఆధీనంలో యెమెన్ రాజధాని సనాతోపాటు, సౌదీకి దగ్గరగా ఉండే పలు ప్రాంతాలు ఉన్నాయి. హౌతీ సంస్థ 90లలో ఏర్పడినప్పటికీ, 2014లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది.
READ ALSO: Modi Xi Jinping Meeting: ఒకే వేదికపై భారత్- చైనా.. మోడీని కలవడం సంతోషంగా ఉందన్న జిన్‌పింగ్
