NTV Telugu Site icon

ISPL T10 2024: ఐపీఎల్ తరహాలో టీ10 క్రికెట్ టోర్నమెంట్‌.. హైదరాబాద్ టీమ్‌ని సొంతం చేసుకున్న రామ్ చరణ్‌!

Ispl T10 2024

Ispl T10 2024

ISPL T10 Schedule and Teams: ఐపీఎల్ తరహాలో సరికొత్తగా మరో క్రికెట్ టోర్నమెంట్‌ ఆరంభం అవుతోంది. అదే ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో టీ10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ ముంబై వేదికగా జరగనుంది. ‘స్ట్రీట్ టు స్టేడియం’ కాన్సెప్ట్‌తో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయడమే ఈ లీగ్ లక్ష్యం. ఈ లీగ్ కోర్ కమిటీ మెంబర్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో ఆరు టీమ్స్ తలపడనున్నాయి. మాఘీ ముంబై, బెంగుళూరు స్ట్రైకర్స్, శ్రీనగర్ కి వీర్, చెన్నై సింఘమ్స్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా టీమ్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ టీమ్‌ని హీరో రామ్ చరణ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), అమితాబ్ బచ్చన్ (ముంబై), సూర్య (చెన్నై), రామ్ చరణ్ (హైదరాబాద్), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ (కోల్‌కతా) భాగం అయ్యారు. ఐపీఎల్ తరహాలో వేలం వేసి క్రీడాకారులను దక్కించుకున్నారు. మొత్తం 96 మంది ప్లేయర్లు ఆడనున్నారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా మ్యాచులు జరగనున్నాయి.

Also Read: MS Dhoni: చెన్నైలో అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీ.. ఎంట్రీ అదిరిపోలా! వీడియో వైరల్

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుక ఈరోజు సాయంత్రం అట్టహాసంగా జరగనుంది. ఇందులో క్రికెట్ లెజెండ్స్, సినీ సూపర్ స్టార్స్ పాల్గొననున్నారు. సినీ స్టార్స్ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, సూర్య, రామ్ చరణ్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్.. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, యుజ్వేంద్ర చహాల్, స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్ పాల్గొంటారు. ఆరంబ వేడుకలలో గల్లీ బాయ్స్ లైవ్ పర్ఫార్మెన్స్, ధారావి రాకర్స్ బ్యాండ్, సుఖ్విందర్ సింగ్‌లతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరిష్మా కొటక్‌తో స్పెషల్ డాన్స్ షో కూడా ప్లాన్ చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ టీమ్ (మాస్టర్ లెవెన్), అక్షయ్ కుమార్ టీమ్ (కిలాడీ లెవెన్ ) తలపడనుంది.