Islamabad Blast: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. కోర్టు వెలుపల ఆపి ఉంచిన కారులో ఈ భారీ పేలుడు జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం పేలుడు కారుకే పరిమితమైందని, కానీ తరువాత ఐదుగురు మరణించారని నివేదికలు వెలువడ్డాయి.
READ ALSO: IPL 2026: కోల్‌కతాకు రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ రియాక్షన్ ఇదే!
పలు నివేదికల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 12 మంది మరణించగా, దాదాపుగా 20 నుంచి 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతంలో ఆపి ఉంచిన కారులో సిలిండర్ పేలడం వల్లే ఈ పేలుడు సంభవించిందని సమాచారం. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడు జరిగిన సమయంలో కోర్టు ప్రాంగణంలో భారీ ట్రాఫిక్, పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నారు. పేలుడులో అనేక మంది న్యాయవాదులు, సాధారణ పౌరులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని తదుపరి దర్యాప్తు కోసం చుట్టుపక్కల ప్రాంతాన్ని సీల్ చేశారు.
పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇది సిలిండర్ పేలుడుగా కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంపై దర్యాప్తు జరిగిన తర్వాత పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుందని వెల్లడించారు. ఈ పేలుడుకు పాకిస్థాన్ భారతదేశాన్ని నిందించింది. ఢిల్లీ బాంబు దాడి తర్వాత వెంటనే పాకిస్థాన్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
READ ALSO: CM Chandrababu: ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు..
