జర్మనీలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇస్లాం విమర్శకుడు మైఖేల్ స్టర్జెన్ బెర్గర్ పై ఉన్మాద దాడి చేసిన తర్వాత మాన్‌హీమ్ లో కత్తితో దాడి చేస్తున్న ఓ కత్తి కలిగి ఉన్న మనిషిని పోలీసులు కాల్చిచంపారు. అందిన నివేదికల ప్రకారం., మైఖేల్ స్టర్జెన్‌బెర్గర్ అనే ఇస్లాం వ్యతిరేక కార్యకర్త దక్షిణ జర్మనీలోని ఒక నగరంలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
Bigg Boss OTT 3: కొత్త హోస్ట్ ను పరిచయం చేస్తున్న బిగ్ బాస్.. ‘ఇంకీ ఆవాజ్ హాయ్ కాఫీ హై’ అంటూ..
కత్తిపోట్లకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. 49 సెకన్ల ఈ వీడియో క్లిప్ లో దాడి చేసిన వ్యక్తి ఇస్లాం విమర్శకుడు మైఖేల్ స్టర్జెన్ బెర్గర్ ను కత్తితో పొడిచినట్లు చూపిస్తుంది. వీడియో చిత్రీకరణలో.. దాడి చేసిన వ్యక్తి దాడిని ఆపడానికి ప్రయత్నించిన పోలీసు అధికారితో సహా అనేక మంది వ్యక్తులను కత్తితో పొడిచినట్లు కనపడుతుంది.ఈ దాడిలో ఓ పోలీస్ అధికారి పై అలాగే, మరికొంతమంది వ్యక్తులపై కత్తి దాడి జరిగింది. దీంతో ఆ కత్తి పట్టుకున్న వ్యక్తిని ఆపేందుకు పోలీసులు అతని కాల్చగా.. అతడు అక్కడికక్కడే మరణించాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారంది. పూర్తి వివరాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.
https://twitter.com/disclosetv/status/1796502064862040330
