Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: ఐఎస్ఐ నిఘాలో కేంద్ర మంత్రి.. భద్రత మరింత కట్టుదిట్టం

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan: ఐఎస్ఐ నిఘాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈక్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఒక లేఖ పంపింది. ఈ లేఖలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐఎస్ఐ లక్ష్యంగా ఉన్నారని పేర్కొంది. దీంతో భద్రతా సంస్థలు ఆయన భద్రతను పెంచాయి. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో, ఆయనకు ఉన్న Z+ భద్రతతో పాటు మరింత మంది సెక్యూరిటీని పెంచారు.

READ ALSO: Messi vs Revanth Reddy : మినిట్ టూ మినిట్ మ్యాచ్ అప్డేట్స్ ఇలా..!

ఈ సమాచారం అందిన వెంటనే శుక్రవారం రాత్రి ఆయన భోపాల్ బంగ్లా వెలుపల అధికారులు భద్రతను పెంచారు. నిఘా అధికారుల హెచ్చరికల మధ్య కేంద్ర మంత్రి శనివారం రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “ప్రతిరోజూ ఒక మొక్కను నాటాలనే నా ప్రతిజ్ఞకు అనుగుణంగా, భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్క్‌లో నా తోబుట్టువులతో కలిసి మొక్కలు నాటాను” అని రాశారు. ‘మొక్కలను నాటడం అంటే జీవితాన్ని నాటడం లాంటిదని, భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించడానికి, చెట్లను నాటడానికి, మన గ్రహాన్ని ఆకుపచ్చగా, సంపన్నంగా మార్చడానికి అందరం కలిసి రండి. మొక్కల పెంపకం ప్రచారంలో చేరడానికి, ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి’ అని పోస్ట్ చేశారు.

Z+ సెక్యూరిటీ అంటే..
Z+ భద్రతను భారతదేశంలో అత్యున్నత స్థాయి భద్రతా స్థాయిగా పరిగణిస్తారు. Z+ భద్రతలో భాగంగా ఒక వ్యక్తికి 10 కంటే ఎక్కువ మంది NSG కమాండోలు రక్షణ కల్పిస్తారు. మొత్తం మీద, పోలీసు అధికారులతో సహా సుమారు 55 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఆ వ్యక్తి భద్రత కోసం నియమిస్తారు. Z+ భద్రతలో భాగంగా ఉన్న ప్రతి కమాండో కూడా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా ఉంటారు.

READ ALSO: భారత మార్కెట్లో BMW 5 సిరీస్.. కొత్త ఫీచర్ల అదుర్స్!

Exit mobile version