Site icon NTV Telugu

Ishan Kishan: వరుసగా అర్థ సెంచరీలు.. అరుదైన రికార్డు సాధించిన ఇషాన్

Ishan

Ishan

టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ వరుసగా అర్థ సెంచరీలు బాది.. అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా.. మూడవ వన్డేలో ఇషాన్ కిషన్ 43 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక దశలో గిల్‌ను ఒక ఎండ్‌లో నిల్చోబెట్టి వేగంగా ఆడిన ఇషాన్‌ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కారియా వేసిన బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌ అయ్యాడు.

China President Xi Jinping: జిన్‌పింగ్ సంచ‌ల‌న నిర్ణయం… అణ్వాయుధ ద‌ళ టాప్ అధికారుల తొలగింపు

అయితే వెస్టిండీస్ తో సిరీస్ లో భాగంగా.. ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్‌ అర్థసెంచరీలు బాదాడు. దీంతో ఆరో టీమిండియా క్రికెటర్‌గా ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు. ఇషాన్‌ కంటే ముందుగా క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వర్సెస్‌ శ్రీలంక(1982), దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ వర్సెస్‌ శ్రీలంక(1985), మహ్మద్‌ అజారుద్దీన్‌ వర్సెస్‌ శ్రీలంక(1993), ఎంఎస్‌ ధోని వర్సెస్‌ ఆస్ట్రేలియా(2019), శ్రేయాస్‌ అయ్యర్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌(2020) ఉన్నారు.

Exit mobile version