Site icon NTV Telugu

Isha Rebba : “అంగుళం అంగుళం జూమ్ చేసి చూశారు”.. స్టార్ డైరెక్టర్ పై ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్..!

Isha Reba

Isha Reba

సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వారిలో హీరోయిన్ ఈషా రెబ్బా ఒకరు. అచ్చ తెలుగు అమ్మయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా, సరైన హిట్ కోసం ఆమె ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో స్కిన్ కలర్ చాలా ముఖ్యం. కాస్త తక్కువగా ఉన్న కూడా దర్శక నిర్మాతలు నిరాకరిస్తారు. డార్క్ గా ఉన్న హీరోయిన్ లు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురుకున్నారు. ఇందులో ఈషా రెబ్బా కూడా ఒకరని చెప్పాలి.

Also Read : Hema : సినిమా అవకాశాలు లేకపోతే.. రోడ్డు మీద దోశల బండి పెట్టుకుంటా

ఎందుకంటే తాజాగా తరుణ్ భాస్కర్ సరసన నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈషా మాట్లాడుతూ.. ‘కెరీర్ ఆరంభంలో ఒక సినిమా కోసం ఫోటో షూట్ జరిగినప్పుడు, ఒక స్టార్ డైరెక్టర్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్‌కు గురిచేసింది. ఆ దర్శకుడు నా ఫోటోలను అంగుళం అంగుళం జూమ్ చేసి చూస్తూ.. నీ మోచేతులు నల్లగా ఉన్నాయి, నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి అంటూ ముఖం మీదే అనేశారు. ఆ మాటలు విని నేను చాలా ఏడ్చాను.. కనీసం కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండు అనిపించింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా,

అవకాశాలు రావాలంటే పార్టీలకు వెళ్లాలని, తెలుగు అమ్మాయి అని పెట్టుకోవద్దని కొందరు సలహాలు ఇచ్చేవారని వెల్లడించారు. తన తల్లి చనిపోయిన 12వ రోజే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు లేకపోతే ఇండస్ట్రీలో ఆడపిల్లను అందరూ టార్గెట్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version