NTV Telugu Site icon

Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!

Relationship

Relationship

అత్త, కోడలు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే.. పాము, ముంగిసకు మధ్య ఉన్న వైరం అంతా ఉంటుంది. కోడలు చేసే ప్రతి పనిలో అత్తమామలు తప్పు కనిపెట్టి కించపరిచే చేస్తుంటారు. అలాంటప్పుడు.. కోడలు వాళ్లు ఉన్న ఇంట్లో ఉండటం కష్టంగా ఉంటుంది. మీకు కూడా మీ సంబంధంలో అలాంటి అత్త ఉంటే.. ఇంట్లో నుంచి వెళ్లే బదులు ఈ తెలివైన మార్గాల్లో వ్యవహారించండి.. తద్వాత జీవితాన్ని కొంత ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంతకీ ఏంటో తెలుసుకుందాం.

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

1. మానసిక దూరం
మీ అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లైతే.. మానసిక దూరం పాటించడం చాలా ముఖ్యం. ఇది మీ మనస్సుకు ప్రశాంతత, విశ్రాంతిని అందిస్తుంది. మీ అత్తగారు ప్రతికూలంగా మాట్లాడినప్పుడు ప్రతిస్పందించడానికి బదులుగా, మీ మనస్సును శాంతంగా ఉంచండి.

2. వాదించకు
మీ అత్తతో ఏ విషయాల్లోనూ వాదించకండి. ఎందుకంటే.. అలా చేస్తే మీ సంబంధం మరింత క్షీణిస్తుంది. మీరు మీ భర్తతో కూడా కలిసి ఉండలేరు. అందుకే మీ అత్తగారు చెప్పేదానికి ఒక్క మాటలో సమాధానం చెప్పండి. తద్వారా ఎటువంటి వాదనలు ఉండవు.

3. నమ్మకంగా ఉండు
మీ అత్తగారు, కుటుంబ సభ్యులు మీకు ప్రతికూల విషయాలు చెప్పినప్పుడు.. మిమ్మల్ని మీరు బలహీనంగా భావించుకోవద్దు. మీ బాడీ లాంగ్వేజ్ ను ఎల్లప్పుడూ కాన్పిడెంట్ గా ఉంచుకోండి. దీంతో.. మీ బలమైన వ్యక్తిత్వం అవతలి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.

4. అంచనాలు లేవు
ప్రతికూల వ్యక్తులు ఎప్పటికీ మారరని గుర్తించుకోండి. అలాంటప్పుడు మీ అత్తగారు, కుటుంబ సభ్యులు మారే వరకు వేచి ఉండకండి. ఎటువంటి సహాయం ఆశించకండి. మానసికంగా, శారీరకంగా ధృడంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి.

5. మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి
మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడకండి. దీంతో మీరు ప్రతికూలతను వ్యాప్తి చేసే ట్యాగ్ ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.