NTV Telugu Site icon

Brahma Anandam: ఫిబ్రవరి 14న ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్.. సినిమాలో బ్రహ్మానందం లవ్‌స్టోరీ?

Brahma Anandam

Brahma Anandam

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ ‘బ్రహ్మా ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సంప్రదాయ పంచె కట్టులో సంతోషకరమైన చిరునవ్వుతో బ్రహ్మానందరం ఆకట్టుకున్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే నెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇది వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన కథని అర్థమవుతోంది.

READ MORE: Jupally Krishna Rao: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.. కానీ, పథకాలు అమలు చేస్తున్నాం..

ఈ సందర్భంగా నటుడు బ్రహ్మానందం మాట్లాడారు. తాను తాతగా, తన కుమారుడు మనవడిగా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ కథ కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుందన్నారు. అందుకే తాను ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలిపారు. కాగా.. ఓ జర్నలిస్టు ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. “ఈ సినిమా ఫిబ్రవరి 14 విడుదలవుతుంది కాదా.. ఇందులో ఈ చిత్రం మొత్తం మీ గురించే ఉంటుంది కాదా? ఇందులో మీ లవ్‌స్టోరీ ఏమైనా ఉందా?” అని ప్రశ్న సంధించారు. దీనికి బ్రహ్మానందం సమాధానమిచ్చిన స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మానందం తన బట్ట తలను చూపుతు.. మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటలా ఇవి అని చెప్పారు. దీంతో ఈవెంట్‌కి హాజరైన వాళ్లంతా నవ్వుకున్నారు. ఆయన సమధానంతో ఈ సినిమాలో ఆయన లవ్‌స్టోరీ లేదని తెలుస్తోంది.

READ MORE: Balakrishna: పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య