NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి స్టోరీ రివీల్ కు కారణం అదేనా..?

Kalki (3)

Kalki (3)

Kalki 2898 AD : ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాను బిగ్గెస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కించారు. మహాభారత కాలం నుండి 6000 సంవత్సరాల తరువాత జరిగే కథే ఈ కల్కి. అయితే ఈ సినిమాకు ముందు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి. దీనితో నాగ్ అశ్విన్ స్టార్ హీరో ప్రభాస్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించాడు. ప్రభాస్ కల్కి మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఏకంగా 550 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తుంది.

Read Also :Rajnikanth – Salman Khan : పాన్ ఇండియా స్టాయిలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. దర్శకుడు ఎవరంటే..?

కల్కి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. పైగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తుండటంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. కల్కి సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంకా ప్రేక్షకులలో ఎదో కన్ఫ్యూషన్ ఈ సినిమాలోని పరిసరాలు ప్రేక్షకులకి అర్ధం కావడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ “వరల్డ్ ఆఫ్ కల్కి” పేరుతో రెండు ఎపిసోడ్స్ చేసి ప్రేక్షకులకు కల్కి కథను పూర్తిగా రివీల్ చేసారు. దీనితో కల్కి సినిమాపై ప్రేక్షకులకి కన్ఫ్యూషన్ తీరినట్లయింది.

Show comments