NTV Telugu Site icon

Thug Life Movie: మణిరత్నం ‘థగ్ లైఫ్’ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. శింబు ఎంట్రీ?

Simbu

Simbu

Kollywood Hero Simbu To Act in Mani Ratnam’s Thug Life Movie: విశ్వనటుడు కమల్‌ హాసన్‌, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. 37 ఏళ్ల తర్వాత కమల్‌, మణిరత్నం కాంబోలో రూపొందనున్న థగ్‌ లైఫ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం ఉన్న థగ్ లైఫ్ నుంచి స్టార్ హీరో తప్పుకున్నట్లు తెలుస్తోంది.

థ‌గ్‌ లైఫ్ సినిమా నుంచి మాలీవుడ్ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ త‌ప్పుకున్నాడట. సెట్స్‌లో అడుగుపెట్ట‌కుముందే ఈ సినిమాకు అతడు గుడ్‌బై చెప్పాడు. డేట్స్ స‌ర్ధుబాటుకాకపోవ‌డం వ‌ల్లే ఈ మూవీ నుంచి దుల్క‌ర్ బ‌య‌ట‌కు రావాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. థ‌గ్‌ లైఫ్ నుంచి తాను వైదొల‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌ను క‌మ‌ల్‌, మ‌ణిర‌త్నంకు దుల్క‌ర్ వివ‌రించిన‌ట్లు తెలిసింది. అయితే దుల్క‌ర్ స్థానంలో కోలీవుడ్‌ హీరో శింబును తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Also Read: Amitabh Bachchan: అన్నీ ఫేక్‌ న్యూస్‌.. ఐఎస్‌పీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌లో అమితాబ్‌ బచ్చన్‌!

దుల్క‌ర్ స‌ల్మాన్‌ ప్ర‌స్తుతం మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా న‌టిస్తూనే.. మరోవైపు ఇత‌ర భాష‌ల‌లో స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. తెలుగులో ‘ల‌క్కీ భాస్క‌ర్’ మూవీకి దుల్క‌ర్ గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చాడు. త‌మిళంలో సుధా కొంగ‌ర దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న మూవీలో కీల‌క పాత్ర చేస్తున్నాడు. మ‌ల‌యాళంలో రెండు, హిందీలో ఓ మూవీకి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చాడు. దాంతో థ‌గ్ లైఫ్‌కు డేట్స్ స‌ర్ధుబాటు చేయ‌డం క‌ష్టంగా మారింద‌ట. దుల్క‌ర్ స్థానాన్ని శింబు రీప్లేస్ చేసే అవ‌కాశాలు ఉన్నాయని కోలీవుడ్‌లో టాక్. ఈ సినిమాలో త్రిష, జయం రవి, నయనతార, ఐశ్వర్యా లక్ష్మి వంటి స్టార్స్‌ నటిస్తున్నారు.

Show comments