Game Changer: జరగండి జరగండి.. గేమ్ చేంజర్ వస్తున్నాడు.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaragandi Song Release from Game Changer on Ram Charan Birthday: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత మూడేళ్ళగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి పోస్టర్, టైటిల్ తప్ప మరో అప్డేట్ లేదు. ఆమధ్య ‘జరగండి’ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసి.. పోస్ట్ పోన్ చేసి అభిమానులను నిరాశపరిచారు. అయితే ఆ పాటని చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులను ఖుషీ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ‘ జరగండి’ సాంగ్ బుధవారం ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ శంకర్ తన ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే జరగండి పాటను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. కన్నడ, మలయాళం భాషలలో ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం లేదు. కొత్త పోస్టర్‌తో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ, మలయాళం భాషలలో సినిమా విడుదల అవుతుందో లేదో అని నెటిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ముందు నుంచి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Also Read: Preity Zinta-IPL 2024: ప్రీతి జింటా చేసిన పొరపాటు.. పంజాబ్ కింగ్స్‌కు వరంలా మారింది!
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్‌డేట్ రేపు రానున్నట్టు తెలుస్తోంది. విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!