Site icon NTV Telugu

Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?

Megha Akash Birthday

Megha Akash Birthday

Is Megha Akash getting married Soon: ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మొదలు నిన్నటి అపర్ణా దాస్ వంటి చాలా మంది నటీమణులు తమ తమ బాయ్‌ఫ్రెండ్‌లను సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలో హీరోయిన్లు అదితి రావు, తమన్నా కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మేఘా ఆకాష్‌ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆమె హఠాత్తుగా సాంప్రదాయ పద్ధతిలో చీర ధరించి, మెహందీతో తన చేతులను అలంకరించుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త పెళ్లి కూతురిలా కనిపిస్తోంది.

Renu Desai: బీజేపీ అభ్యర్థిపై పవన్ మాజీ భార్య కీలక వ్యాఖ్యలు.. డబ్బులు అందలేదు కానీ?

అంతేకాదు ఆమె షేర్ చేసిన ఫొటోకి #weddingvibes అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించింది. దీంతో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని కొందరు ఊహాగానాలు కూడా మొదలుపెట్టారు. అయితే అసలు విషయం ఏమిటా అని ఆరా తీస్తే ఈ ఫోటోలు ఆమె వివాహానికి ముందు జరిగిన వేడుకల పిక్స్ కాదు, ఆమె చేసిన యాడ్ షూట్ నుండి ఆమె షేర్ చేసినవి అని తెలుస్తోంది. ఆమె పెళ్ళికి రెడీ అవుతున్న మాట నిజమే కానీ ఈ ఫోటోలు ఆమె వివాహ వేడుకకి సంబంధించినవి కావని తెలుస్తోంది. మేఘా ఆకాష్ తెలుగులో “లై,” “ఛల్ మోహన్ రంగ,” “రాజ రాజ చోర,” “గుర్తుందా శీతాకాలం,” మరియు “రావణాసుర” వంటి అనేక తెలుగు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది.

Megha Akashh

Exit mobile version