NTV Telugu Site icon

Saindhav : వెంకటేష్ సైంధవ్ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?

Whatsapp Image 2024 01 18 At 6.04.05 Pm

Whatsapp Image 2024 01 18 At 6.04.05 Pm

టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్‌ . యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌ లో వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి హిట్ ఫేం శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌ మిషన్‌ నేపథ్యం లో సాగే సైంధవ్‌ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. సైంధవ్‌ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞ గా, రుహానీ శర్మ డాక్టర్‌ గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్ర లో మరియు కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో కనిపించారు. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కించగా సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందించారు.

సైంధవ్‌ మూవీ 2024 జనవరి 13 న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఓపెనింగ్‌లో మంచి టాక్‌ తెచ్చుకుంది.తొలి రెండు రోజులు మంచి టాక్‌ తో స్క్రీనింగ్‌ అయిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఫెస్టివల్‌ వీకెండ్‌ అయినప్పటికీ కూడా ఆక్యుపెన్సీ భారీ మొత్తం లో పడిపోయినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం.. సైంధవ్‌ మూవి కి ఇప్పటివరకున్న రెస్పాన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మేకర్స్‌కు నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నిర్మాతలు సేఫ్‌ జోన్‌లోకి రావాలంటే సైంధవ్‌ మూవీ రూ.15 కోట్ల కు పైగా వసూళ్లు చేయాల్సి ఉందట. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అన్ని వసూళ్లు వస్తాయా. అన్నది ప్రశ్నగా మారినట్టు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మరి సైంధవ్‌ మూవీ బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందా లేదో చూడాలి.