Saindhav : వెంకటేష్ సైంధవ్ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్ . యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యం లో సాగే సైంధవ్ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ గా, రుహానీ శర్మ డాక్టర్ గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్ర లో మరియు కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో కనిపించారు. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కించగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
సైంధవ్ మూవీ 2024 జనవరి 13 న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఓపెనింగ్‌లో మంచి టాక్ తెచ్చుకుంది.తొలి రెండు రోజులు మంచి టాక్ తో స్క్రీనింగ్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతోంది. ఫెస్టివల్ వీకెండ్ అయినప్పటికీ కూడా ఆక్యుపెన్సీ భారీ మొత్తం లో పడిపోయినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.. సైంధవ్ మూవి కి ఇప్పటివరకున్న రెస్పాన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మేకర్స్‌కు నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నిర్మాతలు సేఫ్ జోన్లోకి రావాలంటే సైంధవ్ మూవీ రూ.15 కోట్ల కు పైగా వసూళ్లు చేయాల్సి ఉందట. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అన్ని వసూళ్లు వస్తాయా. అన్నది ప్రశ్నగా మారినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి సైంధవ్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందా లేదో చూడాలి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..