Site icon NTV Telugu

Anushka: అనుష్కకు ఆ పాడు అలవాటు ఉందట.. మీరు అసలు నమ్మలేరు

Anushka Shetty

Anushka Shetty

Anushka: ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు. ఇటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అటు కథకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అగ్రహీరోలకు సమానంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిపోయారు. అయితే,ఇటీవల అనుష్క సినిమాలను చాలా తగ్గించేశారు. కోవిడ్ సమయంలో ‘నిశ్శబ్దం’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించి మళ్లీ ఇంతవరకు వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం నవీన్ తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Read Also:Tuesday Remedies: మంగళవారం నాడు ఈ మూడు చర్యలు చేస్తే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు అనుష్క. జనాల్లో ఆమెకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పక తప్పదు . అయితే ఎంతో పాపులారిటీ సంపాదించుకుని చాలా ట్రెడిషనల్ గా కనిపించే అనుష్కకు ఓ పాడు అలవాటు ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఈ వార్తల పైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. నిజానికి అనుష్క పైకి చాలా పద్ధతిగా ఉంటుంది. అంతేకాదు చాలా ట్రెడిషనల్ గా బిహేవ్ చేస్తూ అందరు ఇష్టపడేలా ఉంటుంది. కానీ అనుష్కకు భయంకరమైన అలవాటు ఉందట. తనకి తన చేతి వేలి గోర్లను నమిలే అలవాటు ఉందట. ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన అనుష్కకి సైతం గోర్లు నమిలే అలవాటు ఉందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో , నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అనుష్క ఈ అలవాటును మార్చుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తుందట. కానీ అప్పుడప్పుడు తన ప్రమేయం లేకుండానే చేతివేళ్లు నోట్లోకి వెళ్తుంటాయట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా సర్క్యూట్ అవుతోంది.

Read Also:Jio Financials: జియో ఫైనాన్షియల్ రాకతో.. టాప్ 20లో అదానీ, రూ. 94,000 కోట్లు సంపాదించిన మస్క్

Exit mobile version