NTV Telugu Site icon

Unstoppable-NBK: ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ గెస్ట్‌గా స్టార్ హీరో.. ఆ పుకార్లకు సమాధానం చెప్పాడా?

Nbk Allu Arjun

Nbk Allu Arjun

NBK’s Unstoppable Season 4 Update: నందమూరి బాలకృష్ణ హోస్ట్‏గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో యాక్షన్ ఇరగదీసే బాలయ్య బాబు.. షోలో తన కామెడీతో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్‌ను ఇచ్చారు. దాంతో ఆహా ఓటీటీలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లు రికార్డులు బద్దలు కొట్టాయి. సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోని మళ్లీ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈరోజు అన్‌స్టాపబుల్ సీజన్ 4కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి.. సీజన్ 4ని ప్రకటించబోతున్నట్టు, ఓ ప్రోమో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌కు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గెస్ట్‌గా రానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి ఎపిసోడ్‌కు సంబంధించి షూటింగ్ పూర్తయిందట. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ చిత్రంకు సంబంధించిన ఆసక్తికర సమాధానాలను బాలయ్య బాబు రాబట్టినట్లు టాక్‌.

Also Read: MS Dhoni: ఓడినా, గెలిచినా.. అతడు తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు: ధోనీ

ఈ ఎపిసోడ్‌లో బాలయ్య బాబు నుంచి అల్లు అర్జున్‌కు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురైనట్లు, వాటికి బన్నీ కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన కొన్ని పుకార్లు, మెగా ఫ్యామిలీలో ఉన్న సంబంధాల గురించి ఈ షోలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరోవైపు సీజన్ 4 ఫస్ట్ గెస్ట్‌ దుల్కర్ సల్మాన్ అని వార్తలు వచ్చాయి. ఇప్పటికే షూట్ కూడా కంప్లీట్ అయిందట. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ గెస్ట్‌ ఆడనేది నేడు ప్రోమో వస్తే తేలిపోనుంది. మొత్తానికైతే సీజన్ 4కు అల్లు అర్జున్‌, దుల్కర్ సల్మాన్ రావడం మాత్రం పక్కా. గతంలో అన్‌స్టాపబుల్ షోకి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, గోపీచంద్, రవితేజ, నాని, రానా లాంటి స్టార్ హీరోలు వచ్చిన విషయం తెలిసిందే.

Show comments