Site icon NTV Telugu

Manushi Chhillar Dating: మాజీ సీఎం మనవడితో హీరోయిన్ మానుషి డేటింగ్‌?

Manushi Chhillar Dating

Manushi Chhillar Dating

Manushi Chhillar and Veer Pahariya Romantic Video Goes Viral: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానుషి ప్రేమలో పడ్డారని ఆ వార్తలు సారాంశం. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియాతో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓరీ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో మానుషి, వీర్‌ కలిసి కనిపించారు. వీర్‌ భుజంపై ఆమె సేదతీరుతూ కనిపించడం వైరల్‌గా మారింది. దాంతో వీర్‌తో మానుషి డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా మానుషి చిల్లర్‌, వీర్‌ పహారియాలు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌, ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియా కూడా జంటగా ఈ వేడుకలకు హాజరయ్యారు. మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడే వీర్‌ పహారియా. వీర్‌ నటుడిగా రాణిస్తుండగా.. అతడి సోదరుడు శిఖర్‌ పహారియా వ్యాపారవేత్త.

Also Read: Manu Bahaker-PV Sindhu: పీవీ సింధు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్‌ చేశా.. మను బాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో విశ్వసుందరిగా నిలిచారు. సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, బడే మియా ఛోటే మియా చిత్రాల్లో మానుషి నటించారు. ప్రస్తుతం జాన్‌ అబ్రహం హీరోగా వస్తున్న టెహ్రాన్‌లో నటిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమాలో మానుషి నటించిన విషయం తెలిసిందే.

Exit mobile version