NTV Telugu Site icon

Janwada Farmhouse: జన్వాడ ఫాం హౌస్లో కొలతలు వేస్తున్న అధికారులు..

Janwada

Janwada

హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫాం హౌస్కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో.. ఫాం హౌస్లో అధికారులు కొలతలు వేస్తూ పరిశీలించారు. కాగా.. గత కొద్దీ రోజులుగా జన్వాడ ఫాం హౌస్కు సంబంధించి చర్చ జరుగుతుంది. జన్వాడ ఫాం హౌస్ను కూలుస్తారు అనే అంశంకు సంబంధించి గతంలో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలకు సంబంధించి స్టే ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

Read Also: Mumbai Court: మహిళని చూసి కన్నుకొట్టిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిన కోర్టు..

కొద్దీ రోజులుగా నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల కబ్జాకు సంబంధించి, FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్మాణాలకు సంబంధించి కూల్చే ప్రక్రియను హైడ్రా చేపట్టింది. కాగా.. ఇటీవలే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే.. హైడ్రా కూల్చివేత కంటే ముందు జన్వాడ ఫాంహౌస్ కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్లారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాళాలకు సంబంధించిన అంశాలపై కొలతలు వేశారు అధికారులు. ఇటీవలే కోర్టుకు వెళ్లిన సందర్భంగా హైడ్రాకు ఒక ఆదేశం జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించి నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని సూచించింది. కాగా.. ఈ ఫాం హౌస్ కేటీఆర్ది అని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాం హౌస్కు చేరుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.

Read Also: Top Headlines @ 5PM: టాప్‌ న్యూస్