ఇన్నర్ రింగ్ రోడ్ ( ఐఆర్‌ఆర్) భూకుంభ కోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకి ఈనెల(జనవరి) 10వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Pune: “క్యారెక్టర్‌పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్‌ఫ్రెండ్..
ఇక, ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీనరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు సైతం విధించింది. కాగా, ఈ బెయిల్‌ను రద్దు చేయాలని సవాల్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పిల్ చేసింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది.