Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరానికి చెందిన 19 ఏళ్ల కవల సోదరీమణులు తారానెహ్, రోమినా రహీమీల కన్నీటి కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. జనవరిలో ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. ఆ సమయంలో పాఠశాలలో చదువుకుంటున్న ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా మొదటిసారి ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో పాల్గొన్న కొద్ది రోజులకే, ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వారి ఇంటిపై దాడి చేసి ఆ ఇద్దరినీ బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముసుగు దొంగలు ఇరాన్‌కు చెందిన “ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్” సభ్యులని తేలింది. తమ కూతుళ్లు ఏమైపోయారో తెలియక వారి తల్లి మర్జయా నూర్మొహమ్మదీ దాదాపు నాలుగు నెలల పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసులు, జైళ్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. చివరికి వారికి ఒక చేదు నిజం ఎదురైంది. ఈ కేసులో తారానెహ్కు ఏకంగా మరణశిక్ష విధించగా, రోమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో దిక్కుతోచని ఆ కుటుంబం కోర్టులో అప్పీల్ చేయడమే కాకుండా, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి (యుఎన్) ని కూడా సాయం కోరింది.
అసలు ఈ దారుణం జనవరిలో ఇస్ఫహాన్‌లోని షోహదా చౌక్ దగ్గర ప్రారంభమైంది. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలుపుతున్న సమయంలో తారానెహ్, రోమినాలు కూడా అందులో చేరారు. నిజానికి అంతకుముందు వారు ఎప్పుడూ ఏ విధమైన నిరసనల్లోనూ పాల్గొనలేదు. సరిగ్గా ఆ సమయంలోనే చౌక్ దగ్గర జరిగిన ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు రివాల్యూషనరీ గార్డ్ సభ్యుడు కాగా, మరొకరు నిరాశ్రయుడైన వ్యక్తి. ఈ ఘటన తర్వాత ఈ ఇద్దరు సోదరీమణులతో సహా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై మోలోటోవ్ కాక్టైల్స్ తయారు చేశారని, భద్రతా దళాలపై దాడులు చేశారని తీవ్రమైన ఆరోపణలు మోపారు. అంతేకాకుండా, ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే “దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం” (మొహరేబెహ్) అనే కఠినమైన నేరాన్ని కూడా వీరిపై రుద్దారు.
Also Read
- Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
అయితే ఆ అమ్మాయిలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, చివరికి వారి తరఫు న్యాయవాదులకు కేసు ఫైళ్లను సరిగ్గా చూడటానికి కూడా అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత ఆ సోదరీమణులను వేర్వేరు చీకటి గదుల్లో ఉంచారు. గదులు వేరైనా, ఒకరి భయంకరమైన అరుపులు మరొకరికి వినిపించేవి. అక్కడ వారిని లాఠీలతో దారుణంగా కొట్టారని, మానసిక నరకం చూపించడమే కాకుండా లైంగికంగా వేధించారని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు. ముఖ్యంగా తారానెహ్ మోకాళ్లు, మోచేతులు, చేతులపై లాఠీలతో తీవ్రంగా కొట్టడం వల్ల ఆమె దేహానికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. మే నెలలో ఎట్టకేలకు తల్లిని తమ కూతుళ్లను కలవడానికి అనుమతించినప్పుడు, ఆ తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముఖాలు వాచిపోయి, తలపై వెంట్రుకలు ఊడిపోయి ఉన్న ఆ అమ్మాయిలను చూసి ఆమె మొదట గుర్తుపట్టలేకపోయింది, కేవలం వారి గొంతు ఆధారంగానే వారు తన పిల్లలని తెలుసుకోగలిగింది. తారానెహ్కు పడిన ఉరిశిక్షను ఆపడానికి కుటుంబం ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాదుల ద్వారా ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!