NTV Telugu Site icon

Iran Cruise Missile: ట్రంప్‎ను చంపేందుకు ఇరాన్ సైన్యానికి సరికొత్త క్షిపణి

Missile

Missile

Iran Cruise Missile: ఇరాన్ సైన్యం రివల్యూషనరీ గార్డ్స్ చేతికి.. మరో కొత్త త‌ర‌హా క్రూయిజ్ మిస్సైల్‌ను అందించింది. ఇది సుమారు 1,650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను మిస్సైల్ చేధించగలదని టాప్ కమాండర్ శుక్రవారం వెల్లడించారు. పాశ్చాత్య దేశాల హెచ్చరికల నేపథ్యంలో ఈ క్షిపణి తమ సైన్యానికి బలం చేకూర్చుతుందని ప్రకటించారు. అయితే, సాధారణ సైనికులను చంపేందుకు ఈ క్షిపణిని ఉపయోగించబోమన్నారు. త‌మ టాప్ క‌మాండ‌ర్‌ను చంపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హ‌త‌మార్చేందుకు ఈ క్షిప‌ణిని వాడ‌నున్నట్లు రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ వైమానిక ద‌ళ చీఫ్ అమిరాలి హ‌జిజాదే తెలిపారు.

Read Also: Florida Student: టీచర్‎ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్

ఈమేరకు ఇరాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హజీజాదె మాట్లాడారు. 1650 కిలోమీట‌ర్ల దూరం వెళ్లే క్రూయిజ్ మిస్సైల్‌ను ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్‌ అమ్ముల‌పొదిలో చేర్చిన‌ట్లు ఆయ‌న వెల్లడించారు. 2020లో ఇరాక్ లోని బాగ్దాద్ లో డ్రోన్ ద్వారా దాడి చేసి ఇరాన్ మిలటరీ కమాండర్ క్వాసిం సొలెమనిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. దీనిపై ఇరాన్ సైన్యం గుర్రుగా ఉంది. తమ కమాండర్ ను చంపేసిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని పలుమార్లు హెచ్చరించాయి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను కడతేర్చడమే తమ లక్ష్యమని హజీజాదె తాజాగా ప్రకటించాడు.

Read Also: Annamayya Project: ఇక చకచకా అన్నమయ్య ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు