Site icon NTV Telugu

Iran Russia Nuclear Deal: ఇరాన్‌కు రష్యా దన్ను.. 8 అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మాస్కోతో ఒప్పందం

Iran Russia Nuclear Deal

Iran Russia Nuclear Deal

Iran Russia Nuclear Deal: ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అతలాకుతలం అయిన ఇరాన్ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. తాజాగా ఈ దేశానికి రష్యా దన్నుగా నిలించింది. ఇంతకీ మాస్కో ఇరాన్‌కు ఏ విధంగా దన్నుగా నిలిచిందని ఆలోచిస్తున్నారా.. ఇరాన్‌లో చిన్న అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి రష్యా ముందుకు వచ్చింది. మాస్కోలో బుధవారం రష్యన్ అణు సంస్థ రోసాటమ్ అధిపతి అలెక్సీ లిఖాచెవ్, ఇరాన్ అణు అధిపతి మొహమ్మద్ ఇస్లామీ ఈ ఒప్పందాలపై అధికారికంగా సంతకాలు చేశారు. రోసాటమ్ ఈ ప్రాజెక్టును వ్యూహాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇంతకీ దీనితో ఇరాన్‌కు చేకూరే లబ్ధి ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం..

READ ALSO: UAE: నువ్వు మనిషివా.. మానవ మృగానివా..? నాలుగురు భార్యలు ఏకంగా 100 మంది పిల్లలట..

విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పాటు..
రష్యా దన్నుతో కొత్తగా నిర్మించనున్న 8 అణు విద్యుత్ కేంద్రాలు దేశంలో విద్యుత్తు కొరతలను తీర్చుతాయని ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఇస్లామి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2040 నాటికి దేశంలో 20 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఇరాన్ లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. దీనిని సాధించడానికి ఈ కొత్త 8 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిలో నాలుగు దక్షిణ ప్రావిన్స్ బుషెహర్‌లో ఉంటాయని, ఇవి విద్యుత్ కొరత నుంచి ఇరాన్‌కు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు.

ప్రస్తుతం ఇరాన్‌లో ఒకే ఒకటి పనిచేస్తోంది..
ప్రస్తుతం ఇరాన్ దక్షిణ నగరమైన బుషెహర్‌లో ఒకే ఒక అణు విద్యుత్ ప్లాంట్‌ పని చేస్తుందని తెలిపారు. ఈ రియాక్టర్‌ను కూడా రష్యా నిర్మించిందని, దీని సామర్థ్యం 1 గిగావాట్ అని ఇరాన్ ఉపాధ్యక్షుడు తెలిపారు. రష్యా – ఇరాన్ బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు రష్యా విమర్శించింది. జూన్ 13న ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైన్య కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు సహా 1,000 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతిస్పందించింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెలీయులను చంపినట్లు నివేదికలు వచ్చాయి. ఇదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ కూడా మూడు ఇరానియన్ అణు ప్రదేశాలపై బాంబు దాడి చేసింది. అనంతరం ఇరాన్ తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని పేర్కొంది.

శిథిలాల కింద యురేనియం నిల్వలు..
ఇజ్రాయెల్, అమెరికా దాడుల తరువాత ఇరాన్ హై-గ్రేడ్ యురేనియం నిల్వలు శిథిలాల కింద పాతిపెట్టబడ్డాయని సెప్టెంబర్ 11న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అంగీకరించారు. ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఇరాన్ యురేనియం నిల్వలపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసిన సందర్భంలో అరఘ్చి ఈ ప్రకటన చేశారు. జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పటి నుంచి ఇరాన్ కార్యకలాపాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని అణు నిఘా సంస్థ పేర్కొంది.

READ ALSO: Taliban vs America: అమెరికాతో యుద్ధానికి సై అంటున్న తాలిబన్లు.. ఇంతకీ వీళ్ల బలం ఏంత?

Exit mobile version