Site icon NTV Telugu

US Alert: ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం.. యుద్ధ నౌకలు తరలింపు

Ae

Ae

24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా.. తనమిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పటికే సహాయసహకారాలు అందిస్తున్న అమెరికా.. తాజాగా యుద్ధనౌకలను దింపింది. అమెరికా నుంచి అదనపు సైనిక దళాలను రంగంలోకి దించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు బైడెన్ ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఇజ్రాయెల్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడ చదవండి: Patanjali Honey : తేనె నమూనా పరీక్షలో విఫలమైన పతాంజలి.. రూ.లక్ష జరిమానా

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ ఇటీవల వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన సీనియర్ ఆఫీసర్‌తో పాటు పలువురు మృత్యువాత పడ్డారు. అప్పటినుంచి ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులకు తెగబడొచ్చని సమాచారం. ఆదివారం నాటికి ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడికి రెడీ అయింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇది కూడ చదవండి: Heroine Namitha: హీరోయిన్ సంచలన నిర్ణయం.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..!

మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. నెతన్యాహును గుడ్డిగా నమ్మొద్దని కోరింది. ఒకవేళ జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికాకు కూడా ఇరాన్ తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లు, క్షిపణులు, బాంబు దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదింగల సామర్థ్యం గల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు మధ్యధరా సముద్రంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు మోహరించాయి. క్షిపణులను ఎదుర్కోగలిగే యుద్ధ యంత్రాలను అమెరికా సిద్ధం చేసింది. ఇక పరిస్థితులను అంచనా వేయడానికి జో బైడెన్.. యూస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మైఖేల్ కురిల్లాను ఇజ్రాయెల్‌‌కు పంపించారు.

ఇది కూడ చదవండి: Pawan Kalyan Tirupati Tour: తిరుపతి నేతలతో అర్థరాత్రి వరకు జనసేనాని చర్చలు.. ఒక్కతాటిపైకి వచ్చేశారు..

మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయా దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని సూచించాయి. ఫ్రాన్స్, భారత్, రష్యా, పోలాండ్, అమెరికా సహా పలు దేశాలు.. ఇజ్రాయెల్ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. తాము సమాచారం తెలియజేసే వరకూ వెళ్లొద్దని పేర్కొన్నాయి. ఇక తమ పౌరులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.

ఇది కూడ చదవండి: Pakistan : ఆర్మీ సిబ్బందిపై దాడి.. పోలీసులను బందీలుగా పట్టుకున్న పాక్ సైనికులు

Exit mobile version