Israel–Hamas Conflict: హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడుల్లో దారుణం జరిగింది. ఈ దాడుల్లో 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ ప్రకటించింది. వారిలో ఇజ్రాయెలీలతో పాటు పలు దేశాల పౌరులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. గత 24 గంటల వ్యవధిలో గాజాలోని ఐదు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో అక్కడున్న పౌరులతో పాటు పలువురు చనిపోయారని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో హమాస్ అదుపులో ఉన్న బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందు కోసం ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టాలని ఆదేశాలు జారీ ఇజ్రాయెల్ వెల్లడించింది.
Read Also: Sanjay Raut: యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా..
ఇక, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గాజాపై బాంబు దాడులను ఇజ్రాయెల్ ఆపకపోతే.. యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ కు సూచించింది. లెబనాన్ రాజధాని బీరుట్ లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్ డొల్లాహియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ఉద్రిక్తతలు మరింత పెరిగే ముప్పు ఉంది అని అని ఆయన చెప్పారు. లెబనాన్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానీతో సమావేశం తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ కామెంట్స్ చేశారు. గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ మద్దతు ఇస్తుంది.
