NTV Telugu Site icon

Ira Khan Wedding: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఐరా ఖాన్.. జాగింగ్ దుస్తుల్లోనే పెళ్లి చేసుకున్న నూపూర్!

Ira Khan Marries Nupur Shikhare

Ira Khan Marries Nupur Shikhare

Aamir Khan Daughter Ira Khan Marries Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్‏నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. ఐరా, నూపుర్‌ల వివాహం బుధవారం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‏లో గ్రాండ్‏గా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు మధ్య ఐరా, నూపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. హీరో అమీర్ ఖాన్, సినీ నిర్మాత రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్ (27) అన్న విషయం తెలిసిందే.

అమీర్ ఖాన్ కూతురు వివాహం సంప్రదాయా పెళ్లికి భిన్నంగా జరిగింది. వరుడు గుర్రంపై ఆచారంగా గ్రాండ్ గా బరాత్ తో వివాహ మండపానికి రావాల్సింది. కానీ నూపూర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నాడు. గతేడాదిసెప్టెంబర్‌లో ఈ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇటీవల ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.

Also Read: IND vs SA: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్ ఖాతాలో చెత్త రికార్డు!

37 ఏళ్ల నూపుర్ శిఖరే వివాహ వేడుక వద్దకు భిన్నంగా వచ్చాడు. ఆచారం ప్రకారం నూపుర్ గుర్రంపై వివాహ మండపానికి రావాల్సి ఉండగా.. దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. అంతేకాదు జాగింగ్ దుస్తుల్లోనే ఐరా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వివాహంలో అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు సందడి చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

Show comments