NTV Telugu Site icon

iQOO Z9x Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. ‘ఐకూ జెడ్‌ 9ఎక్స్‌’పై 6 వేల తగ్గింపు!

Iqoo Z9x Offers

Iqoo Z9x Offers

iQOO Z9x Amazon Offers: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఐకూ తన జెడ్‌ సిరీస్‌లో భాగంగా గత మేలో ‘ఐకూ జెడ్‌ 9ఎక్స్‌’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో వచ్చిన ఈ 5జీ ఫోన్‌లు.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌లపై అమెజాన్‌ భారీ ఆఫర్స్ ప్రకటించింది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే రూ. 6 వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

ఐకూ జెడ్‌ 9ఎక్స్‌ 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా ఉంది. ప్రస్తుతం 24 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో ఈ ఫోన్ రూ.14,498కి అందుబాటులో ఉంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.13,998కే సొంతం చేసుకోవచ్చు. అంటేమీరు 5 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999 కాగా.. 28 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.12,998కే కొనుగోలు చేయోచ్చు. బ్యాంకు ఆఫర్ కలుపుకుని మీకు 6 వేల తగ్గింపు లభిస్తుంది.

Also Read: Pakistan Cricket: చెత్తగా ఓడినా డ్రెస్సింగ్‌ రూమ్‌లో నవ్వుకుంటున్నారు.. పాక్ క్రికెటర్లపై మాజీలు ఫైర్!

ఐకూ జెడ్‌ 9ఎక్స్‌ స్పెసిఫికేషన్స్:
# 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్‌ రేటు,1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6జెన్‌ 1 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌
# 50 ఎంపీ ప్రధాన కెమెరా
# 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 6000mAh బ్యాటరీ (44W ఫాస్ట్‌ ఛార్జింగ్)

Show comments