NTV Telugu Site icon

iQOO Z9s Pro Price: ‘ఐకూ’ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్స్.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్!

Iqoo Z9s Pro Price

Iqoo Z9s Pro Price

iQOO Z9s Pro and iQOO Z9s 5g Smartphones Launch in India: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లే రిలీజ్ అయినా.. మంచి క్రేజ్ దక్కింది. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోన్న ఐకూ.. తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. సూపర్ లుక్‌తో ఐకూ జెడ్‌9ఎస్‌, జెడ్‌9ఎస్‌ ప్రోలను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌ 14తో పనిచేసే ఈ మొబైల్స్‌లో 50 ఎంపీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, IP64 రేటింగ్‌ ఉన్నాయి. ఈ మొబైల్స్‌ ధర, ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం.

iQOO Z9s:
ఐకూ జెడ్‌9 ఎస్‌ 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999గా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. ఓనిక్స్‌ గ్రీన్‌, టైటానియం మ్యాట్‌ రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 29 నుంచి జెడ్‌9 ఎస్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.2,000 డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఐకూ జెడ్‌9 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌14, 120Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను అమర్చారు. ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉండగా.. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 44 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Also Read: Gold Rate Today: నిన్న 500 పెరిగితే.. నేడు 300 మాత్రమే తగ్గింది! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

iQOO Z9s Pro:
ఐకూ జెడ్‌9ఎస్‌ ప్రో 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.24,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా ఉంది. లక్సీ మార్బల్‌, ఫ్లామ్‌బాయంట్‌ ఆరెంజ్‌ రంగుల్లో ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.3,000 డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఐకూ జెడ్‌9 ఎస్‌లో 6.77 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌14, 120Hz రిఫ్రెష్‌ రేటు ఉన్నాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు. ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ సోనీ IMX882 సెన్సర్‌, 8 ఎంపీ అల్ట్రా వైల్డ్‌ కెమెరా.. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5,500 mAh ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.