ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఐకూ Z11 లైట్‌ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు భారత వినియోగదారుల ముందుకు iQOO Z11 మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఐకూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్యా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పరోక్షంగా సూచించారు. ఆయన చేసిన ఒక ఆసక్తికర పోస్ట్‌లోని లైన్ల మొదటి అక్షరాలను కలిపితే “Z11” అని వస్తుండటంతో ఈ ఫోన్ విడుదల త్వరలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.
లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ గీక్‌బెంచ్ (Geekbench AI) బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై I2514 మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని, 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ ‘డైమెన్సిటీ 7500 టర్బో’ ప్రాసెసర్‌తో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. చైనా, మలేషియా వర్షన్‌లలో వేర్వేరు ప్రాసెసర్లను అందించిన కంపెనీ, భారత వర్షన్ కోసం ఈ ప్రత్యేక చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. అంతేకాకుండా, దీని ముందు భాగంలో కర్వ్‌డ్-ఎడ్జ్ AMOLED డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనిలో 9020 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సంవత్సరం భారత్‌లో లాంచ్ కాబోతున్న చివరి ఐకూ స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చు. ఐకూ 16 మోడల్ చైనాలో ఈ ఏడాది చివర్లో విడుదలైనప్పటికీ, మెమరీ ధరలు పెరగడం వల్ల భారత మార్కెట్లోకి రావడం ఆలస్యం కావచ్చు. ధర ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, త్వరలోనే ఈ మోడల్ లాంచ్ తేదీ మరియు పూర్తి ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.

