NTV Telugu Site icon

iQOO 13 5G: వావ్.. అనిపించే ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టబోతున్న iQOO 13

Iqoo 13

Iqoo 13

iQOO 13 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (IQOO) దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. సరికొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ.. మార్కెట్ లో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫోన్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా మరో ఫోన్ ను దేశీయ మార్కెట్లో పరిచయం చేసింది. iQOO 13 ను చైనాలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో ప్రారంభించబడింది. ఇప్పుడు త్వరలో భారతదేశంలో ఈ ఫోన్ ను ప్రారంభించబోతోంది. ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్లో iQoo 13 అమ్మకానికి అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Read Also: J&K Assembly session: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370పై రగడ..

భారత్ లో ఐక్యూ 13 సంబంధించి లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. ఇకపోతే, ఈ ఫోన్ లో iQOO 13 స్పెసిఫికేషన్స్ పార్కుగా చూస్తే.. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 16GB RAM + 1TB స్టోరేజ్, 32MP సెల్ఫీ కెమెరా, 50MP రియర్ కెమెరా, 6150mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే iQoo 13 6.82 అంగుళాల 2K ఫుల్ HD + డిస్ప్లేను 3168 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ తో కలిగి ఉంది. ఇది BOE 8T LTPO 2.0 స్క్రీన్, OLED Q10 ప్యానెల్ పై నిర్మించబడింది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్, 2592Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఇన్ – డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను సపోర్ట్ చేస్తుంది.

Regina : సినిమాల్లో ఛాన్సుల కోసం నన్ను నేను అమ్ముకోను

iQOO 13 ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 5 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇది 4.32 GHz క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 లైట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. iQOO 13 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. వెనుక భాగంలో, 50MP సోనీ IMX921 OIS ప్రధాన సెన్సార్, 50MP శామ్సంగ్ S5KJN1 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP సోనీ IMX816 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే,, iQOO 13 సిలికాన్ యానోడ్ టెక్నాలజీపై నిర్మించిన 6,150mAh బ్యాటరీతో ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. iQoo 13 IP69 సర్టిఫికేట్ కలిగి ఉంది. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కూడా. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 7, బ్లూటూత్ వి 5.4 ఇంకా ఎన్ఎఫ్సి ఉన్నాయి. ఇక ఈ iQOO 13 చైనాలో మొత్తం 5 వేరియంట్లలో విడుదలైంది. ధర రూ. 47,200 నుండి రూ. 61,400 వరకు ఉంటుంది.

Show comments