Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ విండోలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్. హార్దిక్‌ను ట్రేడ్ చేయాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ట్రేడ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యాను కూడా జట్టులోకి తీసుకురావడానికి ముంబైతో చర్చలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆయన, హార్దిక్ ట్రేడ్ నిజమైతే ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆకాష్ చోప్రా విశ్లేషణ ప్రకారం, ఢిల్లీ ఇప్పటికే తమ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. కుల్దీప్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకున్నప్పటికీ, మరోవైపు హార్దిక్ కోసం అక్షర్ పటేల్, పృథ్వీ షాలను ముంబైకి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అక్షర్ పటేల్ కూడా జట్టును వీడితే, ఢిల్లీకి అనుభవజ్ఞుడైన భారత స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటుగా మారుతుందని హెచ్చరించారు. ఐపీఎల్ వంటి టోర్నీల్లో భారత స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకమని ఆకాష్ చోప్రా తెలిపారు. అలాంటి ఆటగాడిని కోల్పోవడం ఢిల్లీ జట్టు సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..
- Vande Bharat Loco Pilot Salary: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఎంపిక ఎలా జరుగుతుంది.. ఏ అర్హతలు ఉండాలి..?
- New Act: పార్లమెంట్లో కీలక చట్టం.. సైబర్ నేరాలకు మరణశిక్ష..
- Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
మరోవైపు, హార్దిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌తో పాటు రూ.10 కోట్ల నగదు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వచ్చాయి. అయితే బ్రెవిస్‌కు బదులుగా యువ బ్యాటర్ ఆయుష్ మహాత్రేను ఇవ్వాలని ముంబై కోరడంతో చర్చలు ముందుకు సాగలేదని సమాచారం. హార్దిక్ పాండ్యాను ముంబై ఎందుకు ట్రేడ్ చేయాలనుకుంటుందనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ కెప్టెన్సీలో గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా జట్టు వాతావరణంపై ప్రభావం చూపినట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తిలక్ వర్మ రూపంలో భవిష్యత్ నాయకుడు సిద్ధంగా ఉండటంతో ముంబై కొత్త వ్యూహాలపై ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రేడ్ విండో ముగిసేలోపు ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Objection My Lord : మెగాస్టార్ ప్రశంసలతో ఉప్పొంగిపోతున్న ‘అబ్జెక్షన్ మై లార్డ్’ టీమ్..
-
Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..
-
Vande Bharat Loco Pilot Salary: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఎంపిక ఎలా జరుగుతుంది.. ఏ అర్హతలు ఉండాలి..?
-
CM Revanth Reddy : హైడ్రా రద్దే లేదు.. కబ్జాదారులను వదిలేది లేదు.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!