పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని అనుభూతి. పెళ్లి కార్యక్రమం జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకొనే గొప్ప కార్యక్రమం. ఇంతటి అద్భుత కార్యక్రమం తమకి ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నా ఉద్దేశంతో వధూవరులు వారి పెళ్లి తంతును ఎన్నో రకాల కొత్త ఆలోచనలతో ప్లాన్ చేసుకుంటారు. తాజాగా ఇలాంటి ఆలోచనతోనే ఓ జంట తమ పెళ్లి పత్రికకు ఐపిఎల్ ను జత చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Tillu Square OTT : టిల్లు గాడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్ ?
తమిళనాడు రాష్ట్రంలో ఓ జంట తమ పెళ్లి పత్రికకు ఐపిఎల్ థీమ్ ఉండే ఇన్విటేషన్ చేయించుకున్నారు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కలర్స్ తో పాటు వధూవరుల పేర్లను కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోగోలో ముద్రించడం జరిగింది. వీటితోపాటు మ్యాచ్ రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్షన్ అంటూ క్రికెట్ భాషను వాడుతూ వెడ్డింగ్ ఇన్విటేషన్ ను తయారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అతి తక్కువ సమయంలో క్రికెట్ అభిమానుల చొరవను అందుకుంది. దీంతో ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
Also read: Israel Attack: ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలు సేఫ్.. దేశవ్యాప్తంగా విమానాల నిలిపివేత..
వధూవరులు ఇద్దరు కలిసిన వేళ వారిని ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ అంటూ క్రికెట్ అభిమానులు వారిని పోలుస్తున్నారు. ముఖ్యంగా వారిద్దరూ ఈ ఇన్విటేషన్ పోస్టర్ ను పట్టుకొని నిలబడి ఫోటోలకు ఫోజు ఇవ్వడంతో.. ముఖ్యంగా చెన్నై అభిమానులు ‘వాటే మూమెంట్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరైతే మీ కొత్తజంట జీవితాంతం సంతోషంగా ఉండాలంటూ పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
