NTV Telugu Site icon

IPL Retention 2025: కేఎల్ రాహుల్‌కు షాక్.. లక్నోకు కొత్త కెప్టెన్!

Kl Rahul Captaincy

Kl Rahul Captaincy

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబంధించి రిటెన్ష‌న్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్ర‌క‌టించింది. ఈసారి ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్‌ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఊహించినట్లుగానే లక్నో తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. అంతేకాదు కొత్త కెప్టెన్‌ను కూడా ఖరారు చేసిందట. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుందని సమాచారం. సీపీఎల్‌లో, విండీస్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం అతడికి ఉన్న విషయం తెలిసిందే. రూ.18 కోట్లకు పూరన్‌ను రిటైన్ చేసుకుంటుందట. ఐపీఎల్ 2024లో రాహుల్ పేలవ కెప్టెన్సీ చేయడమే అతడి వేటుకు కారణం అని తెలుస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో లక్నో దారుణంగా ఓడిన అనంతరం ఎల్‌ఎస్‌జీ ఓనర్‌ సంజీవ్ గొయెంకా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

Also Read: IPL Retention 2025: కీలక ఆటగాళ్లే టార్గెట్.. ఆర్‌సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే!

మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను వరుసగా రూ.14 కోట్లు, రూ.11 కోట్లు వెచ్చించి తీసుకోనుంది. ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోహ్షిన్ ఖాన్, ఆయుష్ బదోనిలను రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించుకుందట. మార్కస్ స్టొయినిస్‌ను ఆర్‌టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. వేలంలో రాహుల్‌ను దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తోందట. రాహుల్ కర్ణాటక బ్యాటర్ అన్న విషయం తెలిసిందే.