IPL: టాప్-10 లీగ్‌ల జాబితా ప్రకటన.. ఐపీఎల్‌కు ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే..
- టాప్ 10 లీగ్‌ల జాబితా విడుదల..
- మూడో స్థానంలో ఐపీఎల్..
- మొదటి స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన 'ద హండ్రెడ్'..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), తాజాగా విడుదలైన ‘వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్’ (WCA) ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం 10 ప్రధాన లీగ్‌లతో కూడిన ఈ జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ‘ద హండ్రెడ్’ మొదటి స్థానంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన ‘SA20’ రెండో స్థానంలో నిలిచాయి.
WCA నివేదిక ప్రకారం.. ఆటగాళ్లకు ఇచ్చే సగటు జీతం, డబ్బులు సకాలంలో చెల్లించే విషయంలో ఐపీఎల్ అత్యధిక పాయింట్లు సాధించింది. అయితే.. సమస్యల పరిష్కారం, ఇతర సంస్థాగత విషయాల్లో వెనుకబడటం వల్ల అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ లీగ్ (BBL) నాలుగో స్థానంలో.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఐదో స్థానంలో ఉన్నాయి.
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
మిగిలిన లీగ్‌ల రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ద హండ్రెడ్ (75.2), SA20 (68), ఐపీఎల్ (62.6), BBL (62.5), PSL (48), MLC (43), ILT20 (39.1), CPL (38.9), అబుదాబి T10 (30.1), BPL (22.6) వరుసగా 10 స్థానాల్లో ఉన్నాయి.
ఈ సందర్భంగా WCA సీఈఓ టామ్ మోఫాట్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా డొమెస్టిక్ లీగ్‌లు పెరగడం వల్ల క్రికెట్‌కు మేలు జరుగుతోందని.. అయితే అదే సమయంలో ఆటగాళ్ల ప్రయోజనాలను, వారి సంక్షేమాన్ని కాపాడటం చాలా ముఖ్యమని చెప్పారు. అన్ని లీగ్‌లు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని.. అయితే ఆటగాళ్లకు సరైన రక్షణ , ప్రమాణాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి లీగ్‌తో కలిసి పని చేస్తామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?