IPL: టాప్-10 లీగ్‌ల జాబితా ప్రకటన.. ఐపీఎల్‌కు ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే..

  • టాప్ 10 లీగ్‌ల జాబితా విడుదల..
  • మూడో స్థానంలో ఐపీఎల్..
  • మొదటి స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన 'ద హండ్రెడ్'..
Allu Arjun and Atlee Film Title

Allu Arjun and Atlee Film Title

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), తాజాగా విడుదలైన ‘వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్’ (WCA) ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం 10 ప్రధాన లీగ్‌లతో కూడిన ఈ జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన ‘ద హండ్రెడ్’ మొదటి స్థానంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన ‘SA20’ రెండో స్థానంలో నిలిచాయి.

WCA నివేదిక ప్రకారం.. ఆటగాళ్లకు ఇచ్చే సగటు జీతం, డబ్బులు సకాలంలో చెల్లించే విషయంలో ఐపీఎల్ అత్యధిక పాయింట్లు సాధించింది. అయితే.. సమస్యల పరిష్కారం, ఇతర సంస్థాగత విషయాల్లో వెనుకబడటం వల్ల అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ లీగ్ (BBL) నాలుగో స్థానంలో.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఐదో స్థానంలో ఉన్నాయి.

Also Read:Xiaomi Book Pro 14: షావోమీ బుక్ ప్రో 14 లాంచ్.. ఇంటెల్ కోర్ అల్ట్రా X7 358Hతో శక్తివంతమైన ల్యాప్‌టాప్, 72Wh బ్యాటరీ

మిగిలిన లీగ్‌ల రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ద హండ్రెడ్ (75.2), SA20 (68), ఐపీఎల్ (62.6), BBL (62.5), PSL (48), MLC (43), ILT20 (39.1), CPL (38.9), అబుదాబి T10 (30.1), BPL (22.6) వరుసగా 10 స్థానాల్లో ఉన్నాయి.

ఈ సందర్భంగా WCA సీఈఓ టామ్ మోఫాట్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా డొమెస్టిక్ లీగ్‌లు పెరగడం వల్ల క్రికెట్‌కు మేలు జరుగుతోందని.. అయితే అదే సమయంలో ఆటగాళ్ల ప్రయోజనాలను, వారి సంక్షేమాన్ని కాపాడటం చాలా ముఖ్యమని చెప్పారు. అన్ని లీగ్‌లు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని.. అయితే ఆటగాళ్లకు సరైన రక్షణ , ప్రమాణాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి లీగ్‌తో కలిసి పని చేస్తామని ఆయన తెలిపారు.