Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు కేరళలో ఊహించని సంఘటన ఎదురైంది. తన అభిమాన నటిని చూడాలనే ఆత్రుతలో ఒక మహిళా అభిమాని ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు మంజు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని స్టేజ్ దగ్గరకు వచ్చి మంజు వారియర్‌ను కలవడమే కాకుండా ఆమెను గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకుంది.
ఈ అకస్మాత్తు పరిణామంతో మంజు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన అక్కడి యాంకర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. బహిరంగ వేదికపై సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సదరు మహిళను మందలించారు. అయితే దీనిపై ఆ మహిళ స్పందిస్తూ.. “నాకు మంజు అక్క అంటే ప్రాణం. ఆ అభిమానంతోనే ముద్దు పెట్టుకున్నాను తప్ప మరో ఉద్దేశం లేదు” అని బదులిచ్చింది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా అసహనం వ్యక్తం చేస్తారు. కానీ మంజు వారియర్ మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించారు. ఆ సమయంలో అసౌకర్యానికి గురైనప్పటికీ, ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా చిరునవ్వుతో ఆ అభిమానిని పలకరించి ఆ తర్వాత కూడా ఏమీ జరగనట్లుగా మిగతా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి తన మంచితనాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!